Posts

ఇక జగన్ సారు జైలుకేనా

ఇన్నాళ్లకు ఎల్లో మీడియా ( జగన్ సారు మాటల్లో ) ఎదురుచూస్తున్న సమయం వచ్చినట్లు ఉంది. అదేనండి జగన్ సారు జైలుకి వెళ్లే సమయం. ఫైనల్ గా విజయసాయిరెడ్డి సార్ కూడా పోయాడు. పోవడం అంటే పార్టీ నుంచి బయటికి పోయాడు. చూస్తుంటే ఒక్క సజ్జల సార్ తప్ప అందరూ పోయేటట్టు ఉన్నారు. నిజానికి పోవాల్సింది సజ్జలు సారు‍, అప్పుడే జగన్ సార్ కు మంచి రోజులు వస్తాయి. ఇది నా మాట కాదు .. వైసీపీ వాళ్ళ మాట. ముందు షర్మిలమ్మ దూరమైంది.‍ తర్వాత తల్లి విజయమ్మ.‍ ఇప్పుడు అనుంగు మిత్రుడు విజయ సాయి రెడ్డి సార్. ఎవరు పార్టీ నుండి పోయిన జగన్ సార్ కు పెద్దగా పోయేదేమీ లేదు.‍ ( ఆల్రెడీ పోవాల్సిన అధికారం పోయింది.‍ ఇంక పోవడానికి ఏముంది? )  సాయి రెడ్డి సార్ పోతే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే 11 సిబిఐ కేసుల్లో జగన్ సారు సహ‍ నిందితుడు సాయి రెడ్డి సారు. సాయి రెడ్డి సార్ గనక ఇప్పుడు అప్రూవర్‍గా మారితే నా సామి‍ రంగ .. పండగే పండగ తెలుగుదేశం మీడియాకి. హతవిధి ..‍ ఆరు నెలల్లో ఎంత మార్పు !  జగన్ సార్ ను కన్నెత్తి చూడాలంటేనే‍ భయపడే రోజుల్నించి జగన్ సారు సాయి రెడ్డి సారు‍కు భయపడే రోజులు వచ్చాయి.‍ ఇదే కాలం అంటే ..  సాయి రెడ్డి సారు అప్రూవర్‍ గా...

జగన్ సారు పత్రిక వాయిస్తూ ఉంది

అధికారం పోతేనే ప్రజల సమస్యలు కనపడతాయేమో మన మీడియాకు. మొన్నటిదాకా కనపడని పులికాట్‍ సరస్సు సమస్యలన్నీ సాక్షికి ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి. రాయదొరువు‍ దగ్గర,‍ కొండూరు పాలెం దగ్గర కూడిక తీయించి పులికాట్ సరస్సును బ్రతికించాలట.  ఈ పనే‍దో ఐదేళ్లలో జగన్ సార్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? పులికా‍ట్ అంటే అట్లాంటి ఇట్టాంటిది కాదు.‍ ఒకానొక కాలంలో కావేరినది ఇక్కడ సముద్రంలో కలిసేదట.‍ అది ఎంత నిజమో కానీ పులికాటుకు మాత్రం ప్రళయకావేరి అని పేరు ఉంది. 600 చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉండే పులికాట్ సరస్సు ఆరోవంతు భాగం మాత్రమే తమిళనాడులో ఉంటుంది.‍ కానీ ఎండాకాలంలో కూడా ఆ ప్రాంతం నిండుగా నీళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ మన వైపు ఉండే పులికాట్ మాత్రం ఎప్పుడెప్పుడు ఎండిపోదామా అని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నట్టుంటుంది.‍ దానికి కారణం మన ప్రభుత్వం పట్టించుకోదు.‍ ప్రజలూ‍ పట్టించుకోరు.  పులికాట్ ఒక ప్రత్యేక ప్రపంచం.‍ అక్కడి ప్రజల జీవన విధానం చాలా అపురూపమైనది.‍ ఆ ప్రత్యేకత దాదాపు నాశనం అయిపోతూ ఉంది. శ్రీహరికోట ఇస్రో‍ వల్ల దేశానికి గొప్ప మేలు జరిగింది కానీ పులికాట్‍కు,‍ అక్కడి ప్రజలకు మాత్రం అంతులేని దుఃఖాన్నే మిగిల్చి...

చంద్రన్న మాస్టర్ ప్లాన్ ..‍ జగనన్న తట్టుకోగలడా

 గురువుగారు అని అందరూ పిలుచుకునే చాగంటి గారిని కేబి‍నెట్ రేంకుతో సలహాదారుగా నియమించాడు చంద్రన్న .   అది గురువుగారిని గౌరవించడం అని పసుపుజెండా అభిమానులు అంటే అనచ్చేమో గానీ అది చంద్రన్న రాజకీయ వ్యూహమే.  జగనన్నని దెబ్బ తీసే మతరాజకీయంలో భాగమే అది. అందులో తప్పు కూడా ఏమీ లేదు. ఈ రోజు దేశంలో అన్ని పార్టీలు చేస్తోంది అదే. మత రాజకీయం. కుల రాజకీయం.  చాగంటి గారి నియామకంలో రాజకీయం ఏముంది అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థం అవుతుంది.  చాగంటి గారి ప్రవచనాలు వినడం వలన తెలుగు హిందువులలో ఏదో ఒక స్థాయిలో ఉన్న మతాభిమానం ఏకంగా కొన్ని రెట్లు పెరిగిపోయింది. వీరిలో ఎక్కువమంది బిజెపి ఓటర్లుగా ఆటోమేటిక్ గా మారిపోతారు.  జగన్ చిత్తుగా ఓడిపోవడానికి హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి కూటమికి గంపగుత్తగా వెళ్లడం కూడా ఒక కారణం.  చంద్రన్న వ్యూహకర్తలు ఎవరో గానీ చాలా షార్ప్ గా పనిచేస్తున్నారు.  హిందువుల్లో ఇంకా చాలామంది జగన్ వెనుక ఉన్నారు . వారిలో వీలయినంతమందిని వచ్చే ఎన్నికల్లో కూటమి వైపు లాగేయాలి.  అందుకు చాగంటిగారి ప్రవచనాలను మించిన మంత్రం ఏముంటుంది!  రాజకీయం అం...

నేర్చుకోగలిగితే జగన్ సార్ రాజకీయ జీవితం నుంచి ఎవరైనా చాలా నేర్చుకోవచ్చు

‘నేనింతే .. మార్పు అనేది నా డిక్షనరీలో లేదు'‍ అని ఎవరైనా అనుకుంటే అతను శంకరిగిరి మాన్యాలు పట్టిపోవడానికి రూట్ మేప్ వేసుకుంటున్నాడన్నమాట. ఎవరైనా నాకు ఒక ఫిలాసఫి ఉంది . నేను అలాగే ఉంటాను అంటే,‍ కొందరు దాన్ని నిజాయితీ అనవచ్చేమో కానీ దాన్ని మంకుపట్టు అని కూడా అనవచ్చు .  కట్టెలు కొట్టే వాడు అడవికి వెళితే వంకర టింకరలు లేకుండా స్ట్రెయిట్ గా పెరిగిన చెట్టునే ముందు కొడతాడు.  రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందాలి. జీవితం లో కూడా అంతే .  జో జీతా వో సికందర్.  గెలిచిన వాడే గొప్పోడు.  2014 లో రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ హామీ ఇస్తే గెలుస్తాం అని ఎంతో మంది చెప్పారు. మీరు చెప్పారు కాబట్టి ఆ హామీలు అసలు ఇవ్వను. కావాలంటే వేరే హామీలు ఇస్తాను అన్నట్టు గురుడు ఏవో హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత ఐదేళ్లు మూల కూర్చున్నాడు .  2019 లో చంద్రన్న పాలన నచ్చక గెలిపించారు గానీ అందులో జగనన్న గొప్పతనం ఏమీ లేదు.  2024 లో .. రైతు రుణమాఫీ,‍ డ్వాక్రా రుణమాఫీ హామీ,‍ పెన్షల్ల పెంపు  ఇస్తే తప్ప మనం గెలిచే పరిస్థితి లేదు అని మళ్లీ చాలామంది చెప్పారు .  ఇదేనా .. మీరు నన్ను మీరు అర...