Posts

Showing posts from November, 2024

చంద్రన్న మాస్టర్ ప్లాన్ ..‍ జగనన్న తట్టుకోగలడా

 గురువుగారు అని అందరూ పిలుచుకునే చాగంటి గారిని కేబి‍నెట్ రేంకుతో సలహాదారుగా నియమించాడు చంద్రన్న .   అది గురువుగారిని గౌరవించడం అని పసుపుజెండా అభిమానులు అంటే అనచ్చేమో గానీ అది చంద్రన్న రాజకీయ వ్యూహమే.  జగనన్నని దెబ్బ తీసే మతరాజకీయంలో భాగమే అది. అందులో తప్పు కూడా ఏమీ లేదు. ఈ రోజు దేశంలో అన్ని పార్టీలు చేస్తోంది అదే. మత రాజకీయం. కుల రాజకీయం.  చాగంటి గారి నియామకంలో రాజకీయం ఏముంది అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థం అవుతుంది.  చాగంటి గారి ప్రవచనాలు వినడం వలన తెలుగు హిందువులలో ఏదో ఒక స్థాయిలో ఉన్న మతాభిమానం ఏకంగా కొన్ని రెట్లు పెరిగిపోయింది. వీరిలో ఎక్కువమంది బిజెపి ఓటర్లుగా ఆటోమేటిక్ గా మారిపోతారు.  జగన్ చిత్తుగా ఓడిపోవడానికి హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి కూటమికి గంపగుత్తగా వెళ్లడం కూడా ఒక కారణం.  చంద్రన్న వ్యూహకర్తలు ఎవరో గానీ చాలా షార్ప్ గా పనిచేస్తున్నారు.  హిందువుల్లో ఇంకా చాలామంది జగన్ వెనుక ఉన్నారు . వారిలో వీలయినంతమందిని వచ్చే ఎన్నికల్లో కూటమి వైపు లాగేయాలి.  అందుకు చాగంటిగారి ప్రవచనాలను మించిన మంత్రం ఏముంటుంది!  రాజకీయం అం...

నేర్చుకోగలిగితే జగన్ సార్ రాజకీయ జీవితం నుంచి ఎవరైనా చాలా నేర్చుకోవచ్చు

‘నేనింతే .. మార్పు అనేది నా డిక్షనరీలో లేదు'‍ అని ఎవరైనా అనుకుంటే అతను శంకరిగిరి మాన్యాలు పట్టిపోవడానికి రూట్ మేప్ వేసుకుంటున్నాడన్నమాట. ఎవరైనా నాకు ఒక ఫిలాసఫి ఉంది . నేను అలాగే ఉంటాను అంటే,‍ కొందరు దాన్ని నిజాయితీ అనవచ్చేమో కానీ దాన్ని మంకుపట్టు అని కూడా అనవచ్చు .  కట్టెలు కొట్టే వాడు అడవికి వెళితే వంకర టింకరలు లేకుండా స్ట్రెయిట్ గా పెరిగిన చెట్టునే ముందు కొడతాడు.  రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందాలి. జీవితం లో కూడా అంతే .  జో జీతా వో సికందర్.  గెలిచిన వాడే గొప్పోడు.  2014 లో రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ హామీ ఇస్తే గెలుస్తాం అని ఎంతో మంది చెప్పారు. మీరు చెప్పారు కాబట్టి ఆ హామీలు అసలు ఇవ్వను. కావాలంటే వేరే హామీలు ఇస్తాను అన్నట్టు గురుడు ఏవో హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత ఐదేళ్లు మూల కూర్చున్నాడు .  2019 లో చంద్రన్న పాలన నచ్చక గెలిపించారు గానీ అందులో జగనన్న గొప్పతనం ఏమీ లేదు.  2024 లో .. రైతు రుణమాఫీ,‍ డ్వాక్రా రుణమాఫీ హామీ,‍ పెన్షల్ల పెంపు  ఇస్తే తప్ప మనం గెలిచే పరిస్థితి లేదు అని మళ్లీ చాలామంది చెప్పారు .  ఇదేనా .. మీరు నన్ను మీరు అర...