నేర్చుకోగలిగితే జగన్ సార్ రాజకీయ జీవితం నుంచి ఎవరైనా చాలా నేర్చుకోవచ్చు

‘నేనింతే .. మార్పు అనేది నా డిక్షనరీలో లేదు'‍ అని ఎవరైనా అనుకుంటే అతను శంకరిగిరి మాన్యాలు పట్టిపోవడానికి రూట్ మేప్ వేసుకుంటున్నాడన్నమాట.

ఎవరైనా నాకు ఒక ఫిలాసఫి ఉంది . నేను అలాగే ఉంటాను అంటే,‍ కొందరు దాన్ని నిజాయితీ అనవచ్చేమో కానీ దాన్ని మంకుపట్టు అని కూడా అనవచ్చు . 

కట్టెలు కొట్టే వాడు అడవికి వెళితే వంకర టింకరలు లేకుండా స్ట్రెయిట్ గా పెరిగిన చెట్టునే ముందు కొడతాడు. 

రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందాలి. జీవితం లో కూడా అంతే . 

జో జీతా వో సికందర్. 

గెలిచిన వాడే గొప్పోడు. 

2014 లో రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ హామీ ఇస్తే గెలుస్తాం అని ఎంతో మంది చెప్పారు.

మీరు చెప్పారు కాబట్టి ఆ హామీలు అసలు ఇవ్వను. కావాలంటే వేరే హామీలు ఇస్తాను అన్నట్టు గురుడు ఏవో హామీలు ఇచ్చాడు.

ఆ తర్వాత ఐదేళ్లు మూల కూర్చున్నాడు . 

2019 లో చంద్రన్న పాలన నచ్చక గెలిపించారు గానీ అందులో జగనన్న గొప్పతనం ఏమీ లేదు. 

2024 లో .. రైతు రుణమాఫీ,‍ డ్వాక్రా రుణమాఫీ హామీ,‍ పెన్షల్ల పెంపు  ఇస్తే తప్ప మనం గెలిచే పరిస్థితి లేదు అని మళ్లీ చాలామంది చెప్పారు . 

ఇదేనా .. మీరు నన్ను మీరు అర్థం చేసుకుంది ? నాయకులు అడిగింది ఎప్పుడైనా చేశానా .. ప్రజలు కోరుకుంది ఎప్పుడైనా ఇచ్చానా..

మీకు మంచి అనిపించినవి నేను చేయను. నేను మంచి అనుకున్నది చేస్తాను. 

కావాలంటే చూడండి  .. విజయవాడ, గుంటూరు , అమరావతి వాళ్ళు రాజధాని కావాలంటున్నారు. అక్కడ తీసేశాను. వైజాగ్ వాళ్ళు వద్దంటున్నారు. అక్కడ పెట్టాను. దటీజ్ మి.

పెన్షన్ పెంపు లేదు. రుణమాఫీలు లేవు.

చెప్పింది చేస్తాను. చేసేదే చెప్తాను. 

ఏది మంచిది అని ప్రజలు అనుకుంటారో అది నేను చేయను. ఏది మంచిది అని నేను అనుకుంటానో అది చేస్తాను.  ముప్పయి ఏళ్ళు మనమే. పోండి. . 

అలాగే అని నేరుగా అందరూ ఇంటికి పోయారు. 

2014 లో బిజెపి జగన్ ను కలవమని అడిగింది. సింహం సింగులు నో మింగిలు అన్నాడట. 

అయిదేళ్ళు ప్రతిపక్షం దక్కింది.

2024 లో కూడా మోడీసార్ జగన్ గారిని పిలిచి ఎన్డీయేలో కలవమని అడిగాడట. 

'మనం మారం కద సార్. సింహం సింగిలే కదా ' అని జగన్ సారు అన్నాడని వినికిడి. 

ఈసారి ప్రతిపక్షం కూడా దక్కలేదు. 

ఏమైనా ఆంధ్రలో తెలుగుదేశం, జనసేన, బిజెపి డెడ్లీ కాంబినేషను. 

- సాయికిరణ్ పామంజి 

Comments

Popular posts from this blog

చంద్రన్న మాస్టర్ ప్లాన్ ..‍ జగనన్న తట్టుకోగలడా

జగన్ సారు పత్రిక వాయిస్తూ ఉంది