చంద్రన్న మాస్టర్ ప్లాన్ ..‍ జగనన్న తట్టుకోగలడా

 గురువుగారు అని అందరూ పిలుచుకునే చాగంటి గారిని కేబి‍నెట్ రేంకుతో సలహాదారుగా నియమించాడు చంద్రన్న .  

అది గురువుగారిని గౌరవించడం అని పసుపుజెండా అభిమానులు అంటే అనచ్చేమో గానీ అది చంద్రన్న రాజకీయ వ్యూహమే. 

జగనన్నని దెబ్బ తీసే మతరాజకీయంలో భాగమే అది. అందులో తప్పు కూడా ఏమీ లేదు. ఈ రోజు దేశంలో అన్ని పార్టీలు చేస్తోంది అదే. మత రాజకీయం. కుల రాజకీయం. 

చాగంటి గారి నియామకంలో రాజకీయం ఏముంది అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థం అవుతుంది. 

చాగంటి గారి ప్రవచనాలు వినడం వలన తెలుగు హిందువులలో ఏదో ఒక స్థాయిలో ఉన్న మతాభిమానం ఏకంగా కొన్ని రెట్లు పెరిగిపోయింది. వీరిలో ఎక్కువమంది బిజెపి ఓటర్లుగా ఆటోమేటిక్ గా మారిపోతారు. 

జగన్ చిత్తుగా ఓడిపోవడానికి హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి కూటమికి గంపగుత్తగా వెళ్లడం కూడా ఒక కారణం. 

చంద్రన్న వ్యూహకర్తలు ఎవరో గానీ చాలా షార్ప్ గా పనిచేస్తున్నారు. 

హిందువుల్లో ఇంకా చాలామంది జగన్ వెనుక ఉన్నారు . వారిలో వీలయినంతమందిని వచ్చే ఎన్నికల్లో కూటమి వైపు లాగేయాలి. 

అందుకు చాగంటిగారి ప్రవచనాలను మించిన మంత్రం ఏముంటుంది! 

రాజకీయం అంటేనే వ్యూహాలు, ప్రతివ్యూహాలూ.. అధికారం కోసం ఏం చేసినా తప్పు లేదన్నది అనాదిగా వస్తున్నదే. 

జగనన్న ను అష్టదిగ్భంధనం చేసే దిశగా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రన్న వ్యూహకర్తలు . 

మరి జగనన్న ఏం చేస్తాడో చూడాలి. ఏమైనా ప్రతివ్యూహాలు పన్నుతాడో లేక ఎప్పటిలాగే బైబిల్ సూక్తులు చెబుతూ కూచుంటాడో చూడాలి. 

-సాయికిరణ్ పామంజి 

13 నవంబర్ 2024 

Comments

Popular posts from this blog

నేర్చుకోగలిగితే జగన్ సార్ రాజకీయ జీవితం నుంచి ఎవరైనా చాలా నేర్చుకోవచ్చు

జగన్ సారు పత్రిక వాయిస్తూ ఉంది