ఇక జగన్ సారు జైలుకేనా
ఇన్నాళ్లకు ఎల్లో మీడియా ( జగన్ సారు మాటల్లో ) ఎదురుచూస్తున్న సమయం వచ్చినట్లు ఉంది. అదేనండి జగన్ సారు జైలుకి వెళ్లే సమయం.
ఫైనల్ గా విజయసాయిరెడ్డి సార్ కూడా పోయాడు. పోవడం అంటే పార్టీ నుంచి బయటికి పోయాడు.
చూస్తుంటే ఒక్క సజ్జల సార్ తప్ప అందరూ పోయేటట్టు ఉన్నారు. నిజానికి పోవాల్సింది సజ్జలు సారు, అప్పుడే జగన్ సార్ కు మంచి రోజులు వస్తాయి. ఇది నా మాట కాదు .. వైసీపీ వాళ్ళ మాట.
ముందు షర్మిలమ్మ దూరమైంది. తర్వాత తల్లి విజయమ్మ. ఇప్పుడు అనుంగు మిత్రుడు విజయ సాయి రెడ్డి సార్.
ఎవరు పార్టీ నుండి పోయిన జగన్ సార్ కు పెద్దగా పోయేదేమీ లేదు. ( ఆల్రెడీ పోవాల్సిన అధికారం పోయింది. ఇంక పోవడానికి ఏముంది? ) సాయి రెడ్డి సార్ పోతే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే 11 సిబిఐ కేసుల్లో జగన్ సారు సహ నిందితుడు సాయి రెడ్డి సారు.
సాయి రెడ్డి సార్ గనక ఇప్పుడు అప్రూవర్‍గా మారితే నా సామి రంగ .. పండగే పండగ తెలుగుదేశం మీడియాకి.
హతవిధి .. ఆరు నెలల్లో ఎంత మార్పు ! జగన్ సార్ ను కన్నెత్తి చూడాలంటేనే భయపడే రోజుల్నించి జగన్ సారు సాయి రెడ్డి సారుకు భయపడే రోజులు వచ్చాయి. ఇదే కాలం అంటే ..
సాయి రెడ్డి సారు అప్రూవర్ గా మారడులే అంటారా ! ఏమో .. ఎవరు చెప్పగలరు? సొంత షెల్లి షర్మిలమ్మ జగనన్నను కుర్చీ నుంచి దింపే దాకా నిద్రపోదని ఎవరన్నా అనుకున్నారా? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అధికారం కోసం ఎవరైనా మారొచ్చు.
ఇప్పుడు జగన్ సారు తీరిగ్గా బాధపడుతూ ఉంటాడు .. మోడీ సారు అడిగినప్పుడే చేయి కలిపిఉంటే బాగుండేదని. ఆ ఏడు వేలు పెన్షన్ ఏదో మనమే ఇస్తాను అని ఉంటే బాగుండేదని. ప్రజలకు పంచిన ఆ మూడు లక్షల కోట్లు ఏవో పార్టీ నాయకులకు తినబెట్టి ఉంటే బాగుండేదని.
కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.
ఏదోలా మేనేజ్ చేసి జగన్ సారుకు రెండేళ్ళ శిక్ష వేయించేస్తే చాలు. ఇక ఖేల్ ఖతం. దుకాణ్ బంద్.
ఇక పోటీ చేసేదే ఉండదు. పిసుక్కుంటూ కూకోడమే.
- సాయికిరణ్ పామంజి , 25 Jan 2025.
Comments
Post a Comment